You are here
Home > Uncategorized > మీ స్మార్ట్‌ఫోన్లో కెమెరా దగ్గర ఫ్లాష్ లైట్‌కి మధ్య ఉన్నచిన్నరంధ్రం ఏమిటో తెలుసా…!

మీ స్మార్ట్‌ఫోన్లో కెమెరా దగ్గర ఫ్లాష్ లైట్‌కి మధ్య ఉన్నచిన్నరంధ్రం ఏమిటో తెలుసా…!

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..అయితే ఓ సారి ఆ ఫోన్‌ను నిశితంగా పరిశీలించినట్లయితే మీకు కెమెరా దగ్గర ఫ్లాష్ లైట్‌కి మధ్యలో ఓ చిన్న రంధ్రంలాగా కనిపిస్తుంటుంది. మరి అక్కడ అది ఎందుకు పెట్టారనే డౌటు చాలామందికి వస్తుంటుంది.

అది మాములుగా చిన్న రంధ్రం అని చాలామంది పొరపడుతుంటారు.అయితే అది రంధ్రం కాదు.ఓ చిన్నపాటి మైక్రోఫోన్..ఈ చిన్న పాటి రంధ్రాన్నే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు.

దీంతో మీరు ఎటువంటి కాల్స్ వినలేరు.అలాగే మాట్లాడలేరు.అయితే మరి అది అక్కడ ఎందుకుంచారనే డౌట్ రావచ్చు.

మీరు అవతలి వ్యక్తితో బయట ట్రాఫిక్ లో మాట్లాడే సమయంలో ఫోన్ డిస్టబెన్స్ వస్తుంది. అటువంటి మీ వాయిస్ అవతలి వారికి సరిగా వినిపించదు.మీ వాయిస్ అవతలి వారికి క్లియర్ గా వినిపించడానికి ఈ మైక్రోఫోన్ ఏర్పాటు చేశారు. ఈ మైక్ దాని పరిసర ప్రాంతాల్లో ఏమైనా అవరోధాలు ఉంటే వెంటనే తొలగిస్తుంది.

మీరు ఆ శబ్దాలను గ్రహించకుండా కేవలం మాటలను మాత్రమే వినేలా ఈ మైక్రోఫోన్ మీ ఫోన్ ను రెడీ చేస్తుందన్నమాట.

అంతే కాకుండా ఈ రంధ్రంతో మరో బెనిఫిట్ కూడా ఉంది. మీరు మీ వీడియో రికార్డింగ్ అలాగే ఆడియో రికార్డింగ్ ను ఎటువంటి అవరోధ శబ్దాలు లేకుండా స్పష్టంగా రికార్డ్ చేసుకోవచ్చు.మీరు వీడీయో రికార్డింగ్ చేస్తున్పప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా శబ్దాలు ఉంటే వెంటనే వాటిని తొలగించి మీరు కోరుకున్న విధంగా మీకు వీడియోని అందిస్తుంది. అది మీకు తెలియకుండానే జరుగుతుంది.

కొన్ని ఫోన్లకు పైభాగంలో కాకుండా వెనుక భాగంలో కెమెరా పక్కన, అలాగే కొన్నింటికి సైడ్ లలో ఇస్తున్నారు. కాబట్టి మీ ఫోన్ కు రంధ్రం ఎటువైపు ఉందో ఓ సారి చూసుకోండి.

1ఈ సారి కాల్ మాట్లాడే సమయంలో ఆ మైక్ కు ఏదీ అడ్డు పెట్టకుండా మాట్లాడి చూడండి. అప్పుడు మీ వాయిస్ అవరోధాల సమయంలోనూ అవతలి వ్యక్తులకు క్లియర్ గా వినబడుతుంది.

Top