You are here
Home > Uncategorized > సహజమైన టిప్స్ తో కంటి కింద నల్లటి వలయాలు పోగొట్టుకోవచ్చు ప్రయత్నించి చూడండి…

సహజమైన టిప్స్ తో కంటి కింద నల్లటి వలయాలు పోగొట్టుకోవచ్చు ప్రయత్నించి చూడండి…

జీవిత కాలంలో ఏ సమయంలోనైన లేదా ఎపుడైనా, ప్రతి ఒక్కరు కళ్ళ కింద నల్లటి వలయాను పొందుతారు అవునా! చర్మం కింద, సిరలలో రక్త స్థాయిలు తగ్గిపోవటం వలన నిద్రాభంగం కలిగి, అనారోగ్యం, ఒత్తిడి ఏర్పడి, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుటకు కారణాలుగా చెప్పవచ్చు.
ఇలా కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తొలగించుటకు చాలా రకాల పద్దతులు అందుబాటులో ఉన్నాయి. సౌందర్య ఉత్పత్తులు లేదా కాస్మెటిక్స్, ఈ నల్లటి వలయాలను తాత్కాలికంగా కనపడకుండా చేస్తాయి.

సహజంగా కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.

టొమాటో:
టొమాటోలో బ్లీచింగ్ గుణం ఉంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ టమోటా రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకింద ఉన్న నల్లటి వలయాల మీద రాసి.. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బాదం నూనె:
అలాగే బాదం నూనెను కళ్లకు కింద నల్లటి వలయాలపై రాసి.. రాత్రంతా అలానే ఉంచుకుని.. ఉదయాన్నే కడిగేయాలి.

బంగాళాదుంప:
ఇక బంగాళాదుంపలోనూ బ్లీచింగ్ గుణాలున్నాయి. అందుచేత బంగాళా దుంపను తురిమి జ్యూస్‌లాగా చేసి కాటన్ ప్యాడ్స్‌ను ఆ జ్యూసులో కొద్దిసేపు నానబెట్టి వాటిని కనురెప్పల మీద 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి వలయాలు తొలగిపోతాయి.


రోజ్ వాటర్‌:
ఇక రోజ్ వాటర్‌లో కాటన్ ఉండల్ని నానబెట్టి వాటిని కనురెప్పలపైన 15 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా రోజుకు రెండుసార్లు మూడు వారాల పాటు చేస్తే.. కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు.

Top